హైదరాబాద్: భూముల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారుణాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ యజమానులను కేసీఆర్ (KCR) సర్కార్ జైల్లో పెట్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ (Telangana)లో భూ సమస్యలు పెరిగిపోయాయని తెలిపారు. ధరణి వచ్చాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణిలో వారసత్వ భూములు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. ఓటేసిన పాపానికి ప్రభుత్వమే తమ భూములను.. కొల్లగొడుతోందని బాధితులు రోధిస్తున్నారని చెప్పారు. ఓఆర్‌ఆర్, ప్రాజెక్టులు, ఫార్మాసిటీలు, ట్రిపుల్ ఆర్ పేరుతో కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు. ధరణి లోపాల కారణంగా హత్యలు పెరుగుతున్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి