ధరణి పోర్టల్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-30T10:56:49+05:30 IST

తాండూర్‌ మండల కేంద్రంలోని తహసీల్దా ర్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలదేవి, తాండూర్‌ తహసీల్దార్‌ కవిత ప్రారంభించారు.

ధరణి పోర్టల్‌ ప్రారంభం

తహసీల్దార్‌ కార్యాలయాల్లో  ప్రారంభించిన అధికారులు 

పాల్గొన్న రెవెన్యూ సిబ్బంది


జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో గురువారం ధరణి పోర్టల్‌ను అధికారులు ప్రారంభించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఇక సులభతరం కానున్నాయని అధికారులు తెలిపారు.


తాండూర్‌(బెల్లంపల్లి):  తాండూర్‌ మండల కేంద్రంలోని తహసీల్దా ర్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను  బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలదేవి, తాండూర్‌ తహసీల్దార్‌ కవిత ప్రారంభించారు. ఈ సందరంగా ఆర్డీవో మాట్లాడారు. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ సులభతరం అవుతుందని చెప్పారు. . భూముల రిజిస్ర్టేషన్‌ రోజే మ్యూటేషన్‌ పూర్తి చేసి అదే రోజు పట్టాదారు పుస్తకం జారీ చేసే విధానానికి ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రూపొందించిందన్నారు.  వ్యవసాయ భూములను మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో, వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌లను సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో చేపడుతారని అన్నారు. దీంతో భూముల క్రయ విక్రయాలు సులువుగా జరుగుతాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటి తహసీల్దార్‌ మాణిక్‌రావు, ఆర్‌ఐ ఎజాజో ద్దీన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అంజయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


నస్పూర్‌: నస్పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తహసీల్దార్‌ ఆర్‌ శేఖర్‌ గురువారం విలేకరులకు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి తహసీ ల్దార్‌ సంతోష్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ మురళీధర్‌ రావు ిపాల్గొన్నారు. 


లక్షేట్టిపేట: పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్‌ విధానాన్ని కార్యాలయంలో సిబ్బంది పర్యవేక్షించారు.


మందమర్రిరూరల్‌: మండలంలోని రైతులు భూములు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడారు. ధరణి పోర్టల్‌తో భూముల రిజిస్ర్టేషన్‌ సులువుగా జరుగుతుందని చెప్పారు. గతంలో ఉన్న ఇబ్బందులు ఉండవని, తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ర్టేషన్‌ ప్రకియ జరుగుతుందని తెలిపారు. 


జైపూర్‌: రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని తహసీల్దార్‌ ప్రసాద్‌వర్మ, జడ్పీటీసీ  మేడి సునీత అన్నారు. గురువార తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పెద్దపల్లి రమేశ్‌,  పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండు తిరుపతి,  డిప్యూటీ తహసీల్దార్‌ పోచన్న, ఆర్‌ఐ  కమలాదే వి,  రైతు సమితి మండల కన్వీనర్‌ బేతి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


జన్నారం: మండల కేంద్రంలో ధరణి వెబ్‌సైట్‌ను తహసీల్దార్‌ పుష్పలత ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ నవీన్‌, సందేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


కన్నెపల్లి: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మున్వర్‌షరీఫ్‌ ధరణి పోర్టల్‌ సేవలను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్‌ కార్యాలయంలోనే భూముల రిజస్ర్టేషన్‌ల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీటీ ప్రకాష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ గోవర్ధన్‌, ఆర్‌ఐ మోహన్‌, ధరణి కంప్యూటర్‌ ఆపరేటర్‌ జ్యోతి, వీఆర్‌ఏలు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T10:56:49+05:30 IST