ధరణి పోర్టల్‌కు శ్రీకారం

ABN , First Publish Date - 2020-10-30T10:24:08+05:30 IST

జిల్లాలోని మండ ల రెవెన్యూ కార్యాలయాల్లో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి వెబ్‌పోర్టల్‌కు గురువారం శ్రీకారం చుట్టారు.

ధరణి పోర్టల్‌కు శ్రీకారం

సందడిగా సేవలు ప్రారంభం

పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

కార్యాలయాలకు అలంకరణ, ప్రత్యేక పూజలు


తాండూరురూరల్‌/ధారూరు/మోమిన్‌పేట/నవాబుపేట/ బషీరాబాద్‌/ పూడూరు/దౌల్తాబాద్‌/కొడంగల్‌: జిల్లాలోని మండ ల రెవెన్యూ కార్యాలయాల్లో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి వెబ్‌పోర్టల్‌కు గురువారం శ్రీకారం చుట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ధరణి సేవలను ప్రారంభించారు. అవినీతి, అవకతవకలను అరికట్టేందుకే ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాం డూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఎంపీపీ అనితాగౌడ్‌  ధరణి పోర్టల్‌ను పరిశీలించారు. జడ్పీటీసీ గౌడి మంజుల, ఎల్మకన్నె పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎస్‌.రవీందర్‌గౌడ్‌, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ధారూరు తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు ధరణి పోర్టల్‌కు ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు భూముల రిజస్ట్రేషన్లు జరుగలేదు. స్లాట్‌బుక్‌ చేసుకున్న వారికి వరుస క్రమంలో  నిర్ణీత తేదీని నిర్ణయించి వారికి తెలుపుతామని తహసీల్దార్‌ భీమయ్యగౌడ్‌ తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని వివరించారు.


మోమిన్‌పేట మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి పూజ చేసి ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. ఒకే రోజు మ్యుటేషన్‌, పాస్‌బుక్‌ ప్రింట్‌ యజమానికి ఇవ్వడంతో భూములు ఆన్‌లైన్‌లో నమోదవుతాయని అన్నారు. నవాబుపేట మండల కేంద్రంలో తహసీల్దార్‌ బిచ్చయ్య ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీటీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం నుంచి ధరణి పోర్టల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సేవలను ఎంపీపీ కరుణాఅజయ్‌ప్రసాద్‌, సర్పంచ్‌ పూడూరు ప్రియాంక, ఎంపీటీసీ రేఖ పవాన్‌ఠాగూర్‌తో  కలిసి ప్రా రంభించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ షౌఖత్‌అలీ, సీనియర్‌ ఆసిస్టెంట్‌ నారాయణరెడ్డి, నవాంద్గీ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అజయ్‌, మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ రజాక్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు శ్రావణ్‌, సీవో ఆరుణ్‌, ధరణి ఆపరేటర్‌ అనురాధ తదిత రులు పాల్గొన్నారు


. పూడూరు మండల కేంద్రంలో తహసీల్దార్‌ కిరణ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివా్‌సతో కలిసి గురువారం రైతుల సమక్షంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ చాంద్‌పాషా ధరణి సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అనిత, ప్రభు, శ్రీను, ఖయ్యూం పాషా తదితరులు ఉన్నారు. కొడంగల్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య, సేవలను ప్రారంభించారు. ఇంకా తహసీల్దార్‌ శివకుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌ పాల్గొన్నారు.

 

కార్యాలయంపై వివాదం

బొంరా్‌సపేట్‌: ధరణి పోర్టల్‌ కార్యాలయం కోసం బొంరాస్‌పేటలో అధికారుల మధ్య కీచులాట జరిగింది. గురువారం తహసీల్దార్‌ షాహేదాబేగం ధరణి కార్యాలయ ప్రారంభం కోసం ఎంపీడీవో ఆధీనంలో గల ఓ కార్యాలయ భవనం కావాలంటూ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. అధికారుల నుంచి ఆ భవనాన్ని ఖాళీ చేసి ధరణి కార్యాలయం వినియోగం కోసం ఇవ్వాలంటూ ఆదేశాలు వచ్చినా ఎంపీడీవో పట్టించుకోలేదు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సమావేశం కోసం తమకు భవనం లేదంటూ అధికారులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఎట్టకేలకు వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాన్ని రెవెన్యూ సిబ్బంది తాళాన్ని పగులగొట్టి ధరణి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-10-30T10:24:08+05:30 IST