‘ధరణి’ కష్టాలు

ABN , First Publish Date - 2021-10-27T03:58:01+05:30 IST

రైతులకు రెవెన్యూ పరిపాలన, భూరికార్డుల నిర్వహణ సేవలను పారదర్శకంగా, నిమిషాల వ్యవఽధిలోఅందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణిని అమల్లోకి తీసుకువచ్చింది.

‘ధరణి’ కష్టాలు
‘ధరణి’ కష్టాలు

- ఏజెన్సీ భూముల విరాసత్‌కు ఇక్కట్లు
- కొలిక్కి రాని పహణీల సమస్య
- ఏడాదిగా రైతులకు తప్పని తిప్పలు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 26:  రైతులకు రెవెన్యూ పరిపాలన, భూరికార్డుల నిర్వహణ సేవలను పారదర్శకంగా, నిమిషాల వ్యవఽధిలోఅందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణిని అమల్లోకి తీసుకువచ్చింది. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు అన్నీ ధరణి ద్వారానే జరగాలని 2020 అక్టోబరు 28వ తేదీన జీవో జారీ చేసింది. ధరణి ప్రారంభమై ఏడాది గడుస్తున్నా రైతుల సమస్యలు పూర్తి స్థాయిలో పరి ష్కారానికి నోచుకోవడం లేదు. ధరణి పోర్టల్‌ భూములకు సంబంధిం చి అన్ని రకాల ఆప్షన్లు ఇంకా అందుబాటులోకి రానందువల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. గతంలో సాధారణంగా జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కరమయ్యే వాటికి ఇప్పుడు పరిష్కారానికి మార్గం దొరకటం లేదు. ధరణి పోర్టల్‌ ఆవిష్కరణ తర్వాత చిన్న పాటి సమస్యల కోసం కూడా ప్రత్యేక ఆప్షన్‌ విధానం రూపొందించారు. ఇందులో దరఖాస్తు చేసుకున్న వివరాలు నేరుగా హైదరాబాద్‌లోని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగానికి(సీసీఎల్‌ఏ) చేరుకొంటుంది. అక్కడి నుంచి ఆమోదం పొందిన తర్వాత సంబంధిత జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్దకు లాగిన్‌ అయ్యేందుకు అవకాశం ఇచ్చారు. అనంతరం మళ్లీ ఇక్కడి నుంచి నేరుగా సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయానికి అనుసంధా నం అవుతోంది. మూడు విభాగాల్లో సమస్య న్యాయసమ్మతమైతేనే పరిష్కారానికి అనుమతి లభిస్తోంది. గతంలో ఇలాంటి సమస్యలు ఏర్పడితే క్రింద స్థాయి వీఆర్వో, ఆర్‌ఐ విచారణ చేపట్టి తహసీల్దార్‌ పరిష్కారం చేసే విధానం ఉండేది. ఇప్పుడు నూతన విధానం చేపట్టడంతో అన్ని సమస్యలు వస్తున్నాయని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.

ఏజెన్సీ ఏరియాల్లో..
ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న వారికి తీవ్ర చిక్కులు వచ్చి పడుతున్నాయి. తండ్రి పేరిట ఉన్న ఆస్తి కుటుంబ సభ్యుల పేరిట మార్పు కోసం దరఖాస్తు చేసుకుంటే ఏజెన్సీ ఏరియా భూములకు అవకాశం ఇవ్వడం లేదని పోర్టల్‌ సూచిస్తోంది.  దీంతో గతంలో ఏజెన్సీ ఏరియాలో భూమలు సమస్య విషయంలో బాధితులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారసత్వ భూములకు దరఖా స్తులు చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పరిస్థితి నెలకొంది. కొన్నేళ్ల నుంచి తమ తాతల పేరిట వచ్చే భూములకు తాము పూర్తి స్థాయిలో వారసులం ఉన్నప్పటికీ కూడా హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకు పరిష్కారం కావటం లేదని పలువురు రైతులు చెబుతున్నారు. అలాగే పహణీలో పేరు మార్పిడి విషయంలో దరఖాస్తు చేసుకుందమటే అవకాశం లేక పోవటంతో  ఇబ్బందికర మైన సమస్యలు వస్తున్నాయని రైతులు అంటున్నారు. 1954 నుంచి 2015 వరకు ఒకే పట్టే దారు పేరు రాగా ఇప్పుడు ధరణి పోర్టల్‌లో పహణీ పరిశీలిస్తే మరొకరి పేరు రావడంతో పలువురు రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంలో తహసీల్దార్‌ కార్యాల యంలోని అధికారులకు వెళ్లి వాకాబు చేస్తే ధరణిలో కొత్త ఆప్షన్‌ రావాల్సి ఉందని, అప్పటి వరకు వేచి చూడాలని సూచిస్తున్నారని బాధిత రైతులు తెలిపారు. తప్పు పడిన సర్వే నంబర్ల మార్పు కూడా అవకాశం లేని పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ధరణి పోర్టల్‌ ఆవిష్కరణ ముందు సర్వేలు చేపట్టారు. సిర్పూరు, కౌటాల, బెజ్జూరు మండలాల్లో పలు చోట్ల పలు సర్వే నంబర్లకు ఇళ్లు/ఇళ్ల స్థలాలను పేరిట పహణీలో రావడం రైతు లకు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాజమాని పేరు మార్పునకు దరఖాస్తులు చేసుకునేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొంది. గత పక్షం రోజుల క్రితం ఈ సమస్యకు అవకాశం ఇచ్చినా కూడా ఇంత వరకు దరఖాస్తు చేసుకున్న వాటికి అతీగతీ లేని పరిస్థితి దాపురించింది. ఏజెన్సీ ఏరియాల్లో ప్రభుత్వం ఇచ్చిన ఫైనల్‌ పట్టా ఉన్నప్పటికీ ఈ భూములకు ఇతరుల పేరిట పట్టాపాస్‌ పుస్తకం మంజూరు కావడంపై సంబంధిత రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నా రు. తమ భూ సమస్యను పరిష్కరించాలని మూడేళ్లుగా తాము తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయి అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఇంత వరకు పరిష్కారానికి నోచుకోవడం లేదని సంబం ధిత రైతులు పేర్కొంటున్నారు. ధరణి ఫోర్టల్‌ సమస్య దరఖాస్తు చేసు కుందాంటే ఇంత వరకు అవకాశం రావడం లేదు. కొత్త అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు.

ఫైనల్‌ పట్టా ఉన్నప్పటికీ ధరణిలో మరొకరి పేరు..
- ఓమీత్‌ బిశ్వాస్‌, కాగజ్‌నగర్‌

మా నాన్నకు నజ్రూల్‌నగర్‌లోని ఏజెన్సీ ఏరియాలో సర్వేనంబరు 23/290లో 3 ఎకరాల భూమికి ఫైనల్‌ పట్టా  ఉంది. ఈ భూమి తమకు 1973లో ప్రభుత్వం ఇచ్చినది. 2017 వరకు తమ పేరిటనే ఉండేది. ప్రస్తుం ధరణిలో పోర్టల్‌లో మరొకరి పేరు వస్తోంది. ఈ విషయంలో తహసీల్దార్‌కు, ఆర్డీవోకు కూడా వినతి పత్రం ఇచ్చాం. ఇంత వరకు మార్పు కాలేదు. తమకు కనీసం రైతుబంధు దక్కని పరిస్థితి ఏర్పడింది. అధికారుల తప్పిదంతో తమకు అవకాశం లేకుండా పోయింది. ధరణిలో పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుందాంటే ఆప్షన్‌ లేదని చెబుతున్నారు. ఏమీ చేయాలో అర్థం కావటం లేదు.

సమస్యలను ఉన్నతాధికారులకు వివరిస్తున్నాం..
- ప్రమోద్‌కుమార్‌, తహసీల్దార్‌, కాగజ్‌నగర్‌

ధరణిలో ఏర్పడుతున్న మౌలిక సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వివరిస్తున్నాం. వచ్చిన ఫిర్యాదుల విషయంలో కూడా ఉన్నతాధికారులకు సమగ్రంగా తెలియపరిచాం.  కొత్త ఆప్షన్ల విషయంలో కూడా దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు సూచి స్తున్నాం. మా పరిధిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2021-10-27T03:58:01+05:30 IST