జిల్లాలో ధరణి ద్వారా 52 రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-11-29T04:45:45+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో ఇప్పటి వరకు ధరణీ పోర్టల్‌ ద్వారా 52 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కలెక్టర్‌ ఎంవీరెడ్డి తెలిపారు.

జిల్లాలో ధరణి ద్వారా 52 రిజిస్ట్రేషన్లు

 కలెక్టర్‌ ఎంవీ రెడ్డి 

కొత్తగూడెం కలెక్టరేట్‌, నవంబరు 28: భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో ఇప్పటి వరకు ధరణీ పోర్టల్‌ ద్వారా 52 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కలెక్టర్‌ ఎంవీరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో  27 క్రయ విక్రయాలకు సంబంధించినవి, 13 గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్లు, 10 సక్షేషన్లు, 2 పార్టీషన్సు మొత్తం 52 వివిధ రకాల రిజిస్ట్రేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ధరణి ద్వారా ఎల్టీఆర్‌ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నందున గిరిజనులు నుంచి గిరిజనులు కొనగోలు చేసుకొంటే ఆర్టీఓ కే ఫారం జారీచేస్తూ కలెక్టర్‌ ఎల్‌ ఫారం జారీకి సిఫారస్‌ చేస్తారని తెలిపారు. ఽగిరిజనుల భూములు రిజిస్ట్రేషన్‌ కోసం కె ఫారం జారీలో తహసీల్దార్లు జాగ్రత్తగా వ్యవహారించాలన్నారు. కే ఫారం ద్వారా తన నుంచి ఎల్‌ ఫారం జారీకి 2 రోజుల వ్యవధిలోనే సిఫారస్‌ చేయాలని తెలిపారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లో ధరణి రిజిస్టే్ట్రషన్‌ ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు చెప్పారు. ఎల్‌ ఫారానికి రెండు రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకున్న తహసీల్దార్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ధరణి ద్వారా గిరిజనుల భూములు గిరిజనులు మాత్రమే క్రయ విక్రయాలు చేసుకునేందుకు అవకాశం ఉన్నదని ఇట్టి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై సేవలు అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని తెలియజేయాలన్నారు. ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు స్లాబ్‌ బుక్‌ చేసుకునే సౌకర్యం మీ సేవా కేంద్రాల ద్వారా ఉందన్నారు. 


2న వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై సమీక్ష


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తులపై డిసెంబర్‌ 2న సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమీక్షా సమావేశానికి ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు, గన్ని సంచులు, వరికోత యంత్రాలు, పంట విక్రయాలు నిర్వహించిన రైతులకు నగదు చెల్లింపులు తదితర అంశాలపై సమీక్ష  ఉంటుందని సమగ్ర నివేదికతో మధ్యహ్నాం 3 గంటలకు హాజరు కావాలన్నారు.ధాన్యం సేకరణపై రోజువారి నివేధికలు అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న, కొనుగోళ్లపై ప్రతి రోజు సాయంత్రం 5గంటలకు సమగ్ర వివరాలు తెలియజేయాలన్నారు. 


Updated Date - 2020-11-29T04:45:45+05:30 IST