‘ధరణి’ సేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-30T11:07:59+05:30 IST

ధర ణి సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చా యి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభిం చే కార్యక్రమాన్ని అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ని కలెక్టరేట్‌, ..

‘ధరణి’ సేవలు ప్రారంభం

 జిల్లాలో తహసీల్‌ కార్యాలయాలు ముస్తాబు 

వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవాన్ని వీక్షించిన కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అధికారులు 


సిరిసిల్ల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి)/తంగళ్లపల్లి: ధర ణి సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చా యి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభిం చే కార్యక్రమాన్ని అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ని కలెక్టరేట్‌, తహసీల్‌ కార్యాలయాల్లో టీవీల ద్వారా వీ క్షించారు. జిల్లాలోని తహసీల్‌ కార్యాలయాలను ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం సందర్భంగా ముస్తాబు చేశారు. తంగళ్లపల్లి తహసీల్‌ కార్యాలయాన్ని పచ్చని తోరణాల తో పండుగ వేడుకలను తలపించారు. తహసీల్‌ కార్యా లయాల్లోనే ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ ఉపన్యాసాన్ని, కా ర్యాక్రమాన్ని వీక్షించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కృష్ణభాస్క ర్‌, అదనపు కలెక్టర్‌ అంజయ్య, అర్డీవో శ్రీనివాసరావులు వీక్షించారు. జిల్లాలో 13 మండలాలు, 171 రెవెన్యూ గ్రా మాలు, 255 గ్రామ పంచాయతీల పరిధిలో 99,847 సర్వే నంబర్లు ఉండగా 4,61,650 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం తహసీల్‌ కార్యాలయాల ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ర్టేషన్‌ లు జరగనున్నాయి. వ్యవసాయేతర భూములు సబ్‌ రి జిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేయనున్నారు. 


చందుర్తి: రెవెన్యూ సేవలను సులభంగ, పారదర్శ కంగా అందిచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఎంపీపీ బైరగొని లావణ్య ఆన్నారు. 


చందుర్తి తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ను గురువారం ప్రారంభించారు. తహసీల్దార్‌ నరేష్‌, ఏ ఎంసీ చైర్మన్‌ పొన్నాల శ్రీని వాసరావు, సింగిల్‌ విండో చైర్మన్‌ తిప్పని శ్రీనివాస్‌, సర్పంచ్‌లు చిలుక ఆంజిబా బు, నేతికుంట జలపతి, లక్ష్మీ నారాయణ, పర్షరాములు తదితరులు పాల్గొన్నారు. 


వీర్నపల్లి: ధరణి పోర్టల్‌ ప్రారంభం నేపథ్యంలో వీ ర్నపల్లి తహసఈల్దార్‌ కార్యాలయాన్ని పచ్చతోరణాలు, బెలూన్లతో ముస్తాబు చేశారు. సీఎం కేసీఆర్‌ సందేశాన్ని ఎంపీపీ మాలోతు బూలసంతోష్‌నాయక్‌, జడ్పీటీసీ కళా వతి సురేష్‌నాయక్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రవీందర్‌ తదితరులు ఆసక్తిగా విన్నారు.   

Updated Date - 2020-10-30T11:07:59+05:30 IST