మందకొడిగా..పట్టణాల్లో 45.57శాతం ధరణి

ABN , First Publish Date - 2020-10-16T06:25:43+05:30 IST

భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేప ట్టిన ఆస్తుల నమోదు ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో ఆశించిన స్థాయిలో జరగడంలేదు

మందకొడిగా..పట్టణాల్లో 45.57శాతం ధరణి

స్లోగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు

అత్యధికంగా శంకరపల్లిలో 76శాతం పూర్తి

అత్యల్పంగా జల్‌పల్లిలో 14.85శాతం


(ఆంధ్రజ్యోతి. రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : 

భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేప ట్టిన ఆస్తుల నమోదు ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో ఆశించిన స్థాయిలో జరగడంలేదు.  ధరణి పోర్టల్‌ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఆస్తుల వివరాల నమోదును చేపట్టిన విషయం తెలిసిందే.  భవిష్యత్తులో ఆస్తి తగాదాల పరిష్కారం, క్రయవిక్రయాలు పార దర్శకంగా నిర్వహించేందుకు సర్కార్‌ కసరత్తు మొదలు పెట్టింది.  ఇందులో భాగంగా జిల్లాలో వ్యవసాయేతర భూముల లెక్కింపు ప్రక్రియ అఽధికారులు చేపట్టారు. అయితే ఈ కార్యక్రమం కొన్నిచోట్ల వేగవంతంగా సాగడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లా వెనుకబడే ఉంది. రాష్ట్ర సగటు కంటే కూడా ఇక్కడ తక్కువగానే ఆస్తుల నమోదు జరిగింది.  జిల్లాలో జీహెచ్‌ఎంసీ పరిధి మినహా మిగతా పట్టణ ప్రాంతాల్లో జిల్లా యం త్రాంగం ఆస్తులు లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టింది.


జిల్లాలోని 12 మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్‌ కార్పొ రేషన్ల పరిధిలో 2,25,088కి గానూ 1,02,578 ఆస్తులను అంటే 45.57శాతం నమోదు చేశారు. ఇందులో గురు వారం 5,359 ఆస్తులను నమోదు చేశారు. జిల్లాలో అత్య ధికంగా శంకరపల్లి మున్సిపాలిటీలో 76శాతం ఆస్తుల నమోదు పూర్తయింది. అయితే అతి తక్కువగా జల్‌ పల్లిలో 14.85శాతం మాత్రమే నమోదు జరిగింది. ఇది రాష్ట్రంలోనే అతితక్కువ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే  తుక్కుగూడ మున్సిపాలిటీలో  75.23శాతం, ఆదిభట్లలో 70.06 శాతం, ఆమన్‌గల్‌లో 68.07శాతం, ఇబ్రహీంపట్నంలో 68శాతం, షాద్‌నగర్‌లో 63.35శాతం, తుర్కయాంజ్‌లో 61.44శాతం, మీర్‌పేటకార్పొరేషన్‌లో 59.62శాతం,  నార్సింగ్‌లో 52శాతం, బడంగపేటలో 50.20శాతం, పెద్ద అంబర్‌పేటలో 48.96శాతం, శంషాబాద్‌లో 42.47 శాతం, మణికొండలో 22.66శాతం ఆస్తుల నమోదు జరిగింది.  

Updated Date - 2020-10-16T06:25:43+05:30 IST