ఉద్యోగ భద్రత కల్పించండి

ABN , First Publish Date - 2020-12-03T05:20:36+05:30 IST

కొవిడ్‌ సెంటర్లలో పనిచేసిన స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం, ఎఫ్‌ఎన్‌ వోలు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, హెల్త్‌ అసిస్టెంట్ల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించండి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న స్టాఫ్‌ నర్సులు,ఎంఎన్‌వోలు,ఎఫ్‌ఎన్‌వోలు

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 2 : కొవిడ్‌ సెంటర్లలో పనిచేసిన స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం, ఎఫ్‌ఎన్‌ వోలు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, హెల్త్‌ అసిస్టెంట్ల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఏలూరు, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం కొవిడ్‌ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి సేవలు చేయించుకుని ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్‌డీ ప్రసాద్‌, కె. రాజారామ్మోహన్‌రాయ్‌ మాట్లాడుతూ ప్రభు త్వం కొవిడ్‌ కాలంలో సేవలు చేయించుకుని జీతాలు చెల్లించక పోవడం అన్యాయమన్నారు. వీరి ఆందోళ నకు సీఐటీయూ పూర్తి సంఘీభావం తెలిపింది. 104 ఉద్యోగుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ మాట్లాడుతూ కొవిడ్‌ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవన్నారు. అనంతరం జేసీని కలిసి వినతిపత్రం అందించారు. జీతాలు త్వరలో చెల్లిస్తామని జేసీ హామీ ఇచ్చారు. దర్నాలో ఒ.అప్పారావు, వాసు, శ్రీనివాస్‌, అనిల్‌రాజు, కనకదుర్గ, పుష్పలత, నాగయామిని, దుర్గా కాంతం, ఎం. నాగరాజు నాయకత్వం వహించారు. ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు, స్టాఫ్‌ నర్సులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T05:20:36+05:30 IST