పొన్నంపల్లిలో పర్యటిస్తున్న టీడీపీ ఇనచార్జ్ భూపేష్‌రెడ్డి
జమ్మలమడుగు రూరల్, మే 26: టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపే్‌షరెడ్డికి జమ్మలమడుగు మండలంలోని భీమరాయుని కొట్టాలులో గురువారం పర్య టించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం పేదలను పట్టించుకోవడంలేదంటూ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.. గ్రామంలో టీడీపీ నాయకులకు, కార్యకర్తలతో మాట్లాడి మహానాడుకు కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని సూచించారు. అనంతరం గ్రామంలో టీడీ పీ నాయకులకు సంబందించిన ఓ వివాహ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్త రసూల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా!
మైలవరం: తెలుగుదేశం పార్టీని నమ్మి తనతో కలిసి పనిచేసేందుకు వచ్చిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని జమ్మలమడుగు టీడీపీ ఇనచార్జ్ భూపేష్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని పొన్నంపల్లిలో ఆయన పర్యటిం చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కార్యకర్తగా కాకుండా సైనికు డిలా మారి పార్టీ అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి కొండయ్య, టీడీపీ మండల నాయకులు గోవింద్, పాపి రెడ్డి, అంకాల్, తదితరులు పాల్గొన్నారు.