Abn logo
Sep 16 2021 @ 23:33PM

ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఇబ్బందులా.. 1077 టోల్‌ ఫ్రీకి డయల్‌ చేయండి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు (వ్యవసాయం), సెప్టెంబరు 16 : జిల్లాలోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా 24 గంటలూ పనిచేసే 1077 టోల్‌ ఫ్రీ నెంబరుకు డయల్‌ చేయాలని కలెక్టర్‌  చక్రధర్‌బాబు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన పనిముట్లు, ఎరువులు, పురుగు మందులను రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు, నాణ్యతతో కూడిన విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.  ఈ సీజనలో ఇప్పటివరకు సుమారు 45వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని ఇంకా 1.5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందని వివరించారు. రానున్న రోజుల్లో 1010 రకం ధాన్యానికి బదులు రైతులు తమకు లాభసాటిగా ఉన్న పంటలు వేసుకోవాలని సూచించారు. జిల్లాలో 100 శాతం ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ హరేంధిరప్రసాద్‌, వ్యవసాయశాఖ జేడీ ఆనందకుమారి, ఉద్యాన శాఖ జేడీ ప్రదీప్‌కుమార్‌, ఆత్మ పీడీ సత్యవాణి, పశుసంవర్థక శాఖ జేడీ మహేశ్వరుడు, పౌరసరఫరాశాఖ  పీడీ పద్మ, వ్యవసాయ సలహా మండలి చైర్మన నిరంజనరెడ్డి, ఏడీఏలు అనిత, ధనుంజయరెడ్డి, ఏవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.