ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేసుకోండి

ABN , First Publish Date - 2020-11-29T04:52:46+05:30 IST

రైతు భరోసా కేంద్రంలో(ఆర్బీకే) రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. శనివారం కాశీబుగ్గ పద్మనాభపురం వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేసుకోండి
కాశీబుగ్గ: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అప్పలరాజు

 మంత్రి సీదిరి అప్పలరాజు

కాశీబుగ్గ: రైతు భరోసా కేంద్రంలో(ఆర్బీకే) రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు  కోరారు. శనివారం కాశీబుగ్గ పద్మనాభపురం వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఎంసీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. వీటిని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌, తహసీల్దార్‌ మధు సూదనరావు, వైసీపీ నాయకుడు బల్ల గిరిబాబు పాల్గొన్నారు. 


దళారీ వ్యవస్థ నిర్మూలనకే...

రాజాం: రైతులు పండించిన పంట దళారీల పాలనవకుండా ఈ వ్యవస్థ నిర్మూలనకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. శనివారం కంచరాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పాలవలస పద్మావతి, వైసీపీ పట్టణ కన్వీనర్‌ పాలవలస శ్రీనివాసరావు, తహసీల్దార్‌ పి.వేణుగోపాలరావు, ఎంపీడీవో బాసూరు శంకరరావు, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాసరావు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గెడ్డాపు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-11-29T04:52:46+05:30 IST