త్వరలో డ్రైయింగ్‌ యార్డు ఏర్పాటుకు చర్యలు

ABN , First Publish Date - 2021-10-29T04:52:14+05:30 IST

త్వరలో డ్రైయింగ్‌ యార్డు (ధాన్యం ఆరబోత) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జేసీ హరేందిర ప్రసాద్‌ తెలిపారు.

త్వరలో డ్రైయింగ్‌ యార్డు ఏర్పాటుకు చర్యలు
డ్రైయింగ్‌ యార్డు ఏర్పాటుకు జేసీ భూముల పరిశీలన

భూముల పరిశీలనలో జేసీ 


బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 28: త్వరలో డ్రైయింగ్‌ యార్డు (ధాన్యం ఆరబోత) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జేసీ హరేందిర ప్రసాద్‌ తెలిపారు. వవ్వేరు కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు సంబంధించి డ్రైయింగ్‌ యార్డుకు మండలంలోని జొన్నవాడ తిప్ప ప్రాంతంతో పాటు కట్టుబడిపాళెంలోని పలు భూములను గురువారం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  యార్డు ఏర్పాటు కోసమే భూములు పరిశీలించినట్లు తెలిపారు. పరిశీలించిన భూముల్లో సమస్యాత్మక విషయాల గురించి తహసీల్దారు హమీద్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వవ్వేరు పరిధిలోని సచివాలయం-2ను సందర్శించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి తప్పనిసరిగా అందాలని సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు సూచించారు.  కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాసరావు, ఆర్‌ఐ, కట్టుబడిపాళెం వీఆర్వో, జొన్నవాడ వీఆర్వో, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.    


జొన్నవాడ తిప్ప ఽడ్రైయింగ్‌ యార్డుకేనా?  

జేసీ జొన్నవాడ తిప్పను పరిశీలిస్తున్న సమయంలో ఈ తిప్పమీద స్థల సేకరణ ఽడ్రైయింగ్‌ యార్డుకా.. లేక మరిదేనికైనా అంటూ తహసీల్దారును ప్రశ్నించడం విశేషం. అనంతరం అక్కడ నుంచి వవ్వేరు వద్దకు అనడంతో వవ్వేరా...అంటూ ఉలిక్కిపడ్డారు. గతంలో వవ్వేరు పరిధిలో, జొన్నవాడ తిప్పమీద గ్రావెల్‌ అక్రమాలపై ఫిర్యాదులు గుర్తొచ్చాయో ఏమో కొంత అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దారు అదేమీలేదు అని చెప్పినా గతంలో తిప్పమీద సర్వే చేసిన గుర్తులతో పాటు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2021-10-29T04:52:14+05:30 IST