ధనుష్ ‘నానే వరువేన్’ షూటింగ్ ప్రారంభం

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సినిమాల పరంగా స్పీడ్ చూపిస్తున్నారు. ఎర్లియర్ గా ‘కర్ణన్, జగమే తంత్రం’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ధనుష్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. ఇక ధనుష్ తాజాగా ‘నానే వరువేన్’ చిత్రంతో రాబోతున్నారు. తన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ బిగిన్ అయినట్టు ప్రకటిస్తూ మరో పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. లెదర్ జాకెట్ తో, కౌబాయ్ టోపీతో, నోట్లో సిగార్ తో అగ్రెసివ్ గా ఉన్న ధనుష్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘కాదల్ కండేన్, యార్ డీ నీ మోగిని, మయక్కం ఎన్న’ సినిమాల తర్వాత తన అన్న దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న సినిమా కావడంతో ‘నానే వరువేన్’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ధనుష్ ఏ రేంజ్ లో హిట్టు అందుకుంటాడో చూడాలి. 


Advertisement