ధనుష్‌ సముద్రఖని నాలుగోసారి

ABN , First Publish Date - 2021-01-10T06:05:52+05:30 IST

ధనుష్‌ రౌడీబేబీ సాంగ్‌ యూట్యూబ్‌లో సంచలనం అయిన విషయం తెలిసిందే. అలాంటి మరో సాంగ్‌ కోసం ధనుష్‌ సిద్ధమవుతున్నారు.

ధనుష్‌ సముద్రఖని నాలుగోసారి

ధనుష్‌ రౌడీబేబీ సాంగ్‌ యూట్యూబ్‌లో సంచలనం అయిన విషయం తెలిసిందే. అలాంటి మరో సాంగ్‌ కోసం ధనుష్‌ సిద్ధమవుతున్నారు. ఓ మాస్‌బీట్‌ సాంగ్‌ను చేసేందుకు ధనుష్‌ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తన ట్విట్టర్లో షేర్‌ చేయగా వైరలయింది.


తన కొత్త చిత్రంలో ఓ మాస్‌ సాంగ్‌ కోసం ధనుష్‌ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ధనుష్‌, మాళవికా మోహనన్‌ కథానాయికగా కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్‌ ట్విట్టర్లో వెల్లడించింది. ధనుష్‌కు ఇది 43వ చిత్రం. స్మృతీవెంకట్‌, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ధనుష్‌, సముద్రఖని కాంబినేషన్‌లో ఇది నాలుగో చిత్రం. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు.


Updated Date - 2021-01-10T06:05:52+05:30 IST