Abn logo
Nov 22 2020 @ 00:28AM

డిసెంబర్‌లో ధనుష్‌ కొత్త చిత్రం

Kaakateeya

ధనుష్‌, మాళవికా మోహనన్‌ జంటగా కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌ వచ్చే నెల్లో ప్రారంభంకానుంది. లాక్‌డౌన్‌లో దర్శకుడు కార్తీక్‌ స్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేయడంతో వచ్చే నెల్లో  షూటింగ్‌ ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మాళవికా మోహనన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో నటుడు ప్రసన్న ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ధనుష్‌ ప్రస్తుతం హిందీ చిత్రం ‘అత్రంగీ రే’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అది ముగించుకొని ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు. సత్యజోతి ఫిల్మ్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
Advertisement