Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 25 May 2022 14:03:45 IST

The Gray Man: ఆకట్టుకుంటున్న Dhanush హాలీవుడ్ మూవీ ట్రైలర్.. కనిపించింది 3 సెకన్లే అయినా..

twitter-iconwatsapp-iconfb-icon

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు ధనుష్. బాలీవుడ్‌లోనూ ‘షమితాబ్’, ‘అత్రంగి రే’ వంటి సినిమాలతో గుర్తింపు సాధించాడు. ఈ తమిళ స్టార్ హీరో కెరీర్‌లో మరో మెట్టు ఎక్కాడు. ఆయన తాజాగా ‘ది గ్రే మ్యాన్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించాడు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మొదటిసారి 200 మిలియన్ డాలర్ల అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 1550 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి ‘Avengers: Infinity War’, ‘Avengers: Endgame’ వంటి పాపులర్ సినిమాలకు దర్శకత్వం వహించిన సోదర ద్వయం ఆంటోనీ, జో రుస్సో డెరెక్టర్స్. ఈ చిత్రంలో ‘అవెంజర్స్’ సిరీస్ సినిమాల్లో కెప్టెన్ అమెరికాగా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రిస్ ఎవాన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీంతో భారీ అంచనాలున్న ఈ మూవీ ట్రైలర్‌ని నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది.


క్రిస్ ఏవాన్స్ (Chris Evans) నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో చేస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్‌‌‌లో రుస్సో బ్రదర్స్ మరోసారి తమ మార్క్ మాయజాలాన్ని చూపించారు. అయితే.. 2 నిమిషాల 12 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌‌లో ధనుష్ కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపించాడు. అది కూడా మాస్ యాంగిల్‌లో. దీంతో ఎంతోమంది ధనుష్ అభిమానులు సూపర్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌ కింద కామెంట్స్ సెక్షన్‌లో ఎక్కువ కామెంట్స్ ధనుష్ గురించే ఉండడం విశేషం. కానీ.. ట్రైలర్‌లో ఆయన కొన్ని సెకన్లు మాత్రమే కనిపించడంపై ధనుష్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నప్పటికీ.. సినిమాలో మాత్రం ఆయనది ఖచ్చితంగా ముఖ్యమైన పాత్రే అయ్యుంటుందని అనుకుంటున్నారు. లేకపోతే పోస్టర్‌లో ధనుష్ ఫొటోని పెట్టరు కదా అని చెప్పుకుంటున్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International