Abn logo
Jan 19 2021 @ 16:41PM

‘నేరగాడు‌’గా ‘కబాలి’ ఫేమ్ ధన్సిక నటించిన చిత్రం

తమిళంలో మంచి విజయం సాధించిన ఓ చిత్రాన్ని 'నేరగాడు' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.. ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో విశేష అనుభవం కలిగిన యువ వ్యాపారవేత్త జి.ఎస్.ఎన్.మూర్తి (చిన్ని). గారపాటి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ హారర్ ఎంటర్‌టైనర్‌ను ఆయన నిర్మిస్తున్నారు. కబాలి ఫేమ్ ధన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జి.ఎస్.ఆర్.మూర్తి (చిన్ని) తెలిపారు. రెగ్యులర్ హారర్ చిత్రాలకు భిన్నంగా.. హారర్ కు యాక్షన్ అండ్ సెంటిమెంట్ జోడించిన  "నేరగాడు".. అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement