రాజ్యసభకు Dhankhar అనుభవం చాలా విలువైనది: Minister జైశంకర్

ABN , First Publish Date - 2022-07-17T09:09:59+05:30 IST

రాజ్యసభకు Dhankhar అనుభవం చాలా విలువైనది: Minister జైశంకర్

రాజ్యసభకు Dhankhar అనుభవం చాలా విలువైనది: Minister జైశంకర్

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌డీఎ అభ్యర్థిగా నామినేట్ అయిన జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అభినందించారు. "అతని గొప్ప పాండిత్యం, గొప్ప అనుభవం రాజ్యసభ పనితీరుకు అపారమైన విలువను కలిగి ఉంటుందని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ధన్‌ఖర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నారు.


అంతకు ముందు ఎన్‌డీఏ అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. జగ్‌దీప్ ధన్‌ఖర్ ప్రజా సేవలో సంవత్సరాలు గడిపాడని మంత్రి ట్వీట్ చేశారు. ఆయనకు చట్టం, రాజ్యాంగంపై లోతైన అవగాహన ఉన్న రైతు బిడ్డ అని చెప్పారు. ఆయన అనుభవంతో భారతదేశం ఎంతో ప్రయోజనం పొందుతుందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-07-17T09:09:59+05:30 IST