దహీ కబాబ్‌

ABN , First Publish Date - 2022-04-23T18:48:10+05:30 IST

పెరుగు - అరకేజీ, మొక్కజొన్న పిండి - ఒక కప్పు, ఓట్స్‌ - ఒక కప్పు. పనీర్‌ - 100గ్రా, ఉల్లిపాయ - ఒకటి, బాదం పలుకులు - పది, ఎండుద్రాక్ష - నాలుగైదు, మిరియాల పొడి

దహీ కబాబ్‌

కావలసినవి: పెరుగు - అరకేజీ, మొక్కజొన్న పిండి - ఒక కప్పు, ఓట్స్‌ - ఒక కప్పు. పనీర్‌ - 100గ్రా, ఉల్లిపాయ - ఒకటి, బాదం పలుకులు - పది, ఎండుద్రాక్ష - నాలుగైదు, మిరియాల పొడి - అర టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో పెరుగు తీసుకోవాలి. అందులో పనీర్‌ ముక్కలు వేయాలి. ఎండు ద్రాక్ష, దంచిన బాదం పలుకులు, వేయించిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. తరువాత మిరియాల పొడి, యాలకుల పొడి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని  కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుని వత్తుకుంటూ మొక్కజొన్న పిండి అద్దుకోవాలి. తరువాత ఓట్స్‌ను అద్దాలి. పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక కబాబ్‌లను వేసి గోధుమరంగులోకి మారే వరకు వేయించాలి. చట్నీతో తింటే ఈ కబాబ్స్‌ రుచిగా ఉంటాయి. 


Updated Date - 2022-04-23T18:48:10+05:30 IST