ధాత్రి మొబైల్ తల్లిపాల నిధి ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-17T03:15:33+05:30 IST

హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే ప్రథమంగా కోఠి ప్రభుత్వ మహిళా కళాశాలలో ధాత్రి మొబైల్ తల్లిపాల నిధిని ప్రారంభించారు.

ధాత్రి మొబైల్ తల్లిపాల నిధి ప్రారంభం

హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే ప్రథమంగా కోఠి ప్రభుత్వ మహిళా కళాశాలలో ధాత్రి మొబైల్ తల్లిపాల నిధిని ప్రారంభించారు. ఎక్కువ పాలు వచ్చే తల్లుల నుంచి పాలు సేకరించి వాటిని పాయిశ్చరైజేషన్ చేసి పాలు రాని తల్లుల పిల్లలకు ఇస్తారు. ఈ సేవలు ఇప్పటికే నీలోఫర్ ఆసుపత్రిలో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అంతేకాకుండా తల్లులకు పాలివ్వడం గురించి, పాల కోసం తీసుకోవాల్సిన పోషకాహారం గురించి ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ టీమ్ సభ్యులు వివరిస్తారు. బిడ్డలు బాగా ఎదిగేందుకు ప్రక్రియలను కూడా తల్లులకు వారి కుటుంబ సభ్యులకు నేర్పిస్తారు. ఈ సేవలు కేవలం నీలోఫర్ ఆసుపత్రిలోనే కాకుండా దూర ప్రాంతాల తల్లులు, పిల్లలకు కూడా అందాలని ధాత్రి మొబైల్ తల్లిపాల నిధిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోఠి ప్రభుత్వ మహిళా కళాశాలతో సుశేన హెల్త్ ఫౌండేషన్ ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ చదివే విద్యార్థులకు ప్రశిక్షణ, ఉద్యోగ అవకాశాలు, పరిశోధన గురించి ఈ అవగాహన పత్రం కుదిరింది. 

ముఖ్య అతిధిగా హాజరైన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఎన్‌సీ‌సీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి వెంకట రంగరాజు, డైరెక్టర్ సుబ్బరాజు, సుసేన హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ముర్తి, కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి, సినీ నటి నభా నటేష్, ప్రిన్సిపాల్ డాక్టర్ విద్యుల్లత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కవిత, క్రాంప్టన్ గ్రీవ్స్ సిఎస్‌ఆర్‌ హెడ్ సీమ పవాస్కర్, డాక్టర్ కలవలపల్లి భవాని ప్రసంగించారు. ఎన్‌సి‌సి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది.  

Updated Date - 2021-09-17T03:15:33+05:30 IST