ఆపరేషన్‌ ‘కందు వడ్డీ’

ABN , First Publish Date - 2022-06-09T13:29:39+05:30 IST

కందు వడ్డీ పేరిట పేదలపై దౌర్జన్యాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ శైలేంద్రబాబు సూచించారు. కందువడ్డీకి సంబంధించిన కేసులను

ఆపరేషన్‌ ‘కందు వడ్డీ’

- దౌర్జన్యాలపై ఉక్కుపాదం 

- Dgp శైలేంద్రబాబు


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 8: కందు వడ్డీ పేరిట పేదలపై దౌర్జన్యాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ శైలేంద్రబాబు సూచించారు. కందువడ్డీకి సంబంధించిన కేసులను సత్వరం విచారించేలా చర్యలు చేపట్టాలని కూడా ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో కందు వడ్డీ వేధింపులతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీనిపట్ల రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆగ్రహంగా వుంది. దీంతో డీజీపీ చర్యలకు ఉపక్రమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆపరేషన్‌ కందువడ్డీ’ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. కందువడ్డీ కేసులన్నింటీని సత్వరం విచారించి చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా బాధితుల సంతకాలతో కూడిన కాగితాలు, ఇతర పత్రాలు సైతం కందువడ్డీకి పాల్పడుతున్న వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. 

Updated Date - 2022-06-09T13:29:39+05:30 IST