శాంతిభద్రతలు భేష్‌

ABN , First Publish Date - 2022-05-25T14:00:17+05:30 IST

రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా వున్నాయని డీజీపీ శైలేంద్రబాబు వెల్లడించారు. స్థానిక ఆవడి పోలీస్‌ కమిషనరేట్‌ను మంగళవారం డీజీపీ పరిశీలించారు. ఆయనకు

శాంతిభద్రతలు భేష్‌

- గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం

- ఇప్పటి వరకూ 20 వేల మంది అరెస్టు 

- డీజీపీ శైలేంద్రబాబు


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా వున్నాయని డీజీపీ శైలేంద్రబాబు వెల్లడించారు. స్థానిక ఆవడి పోలీస్‌ కమిషనరేట్‌ను మంగళవారం డీజీపీ పరిశీలించారు. ఆయనకు కమిషనర్‌ సందీ్‌పరాయ్‌ రాధోడ్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.72 లక్షల నగదు, 218 సవర్ల బంగారం, 100 సెల్‌ఫోన్లను డీజీపీ పరిశీలించారు. అంతేగాక చురుగ్గా వ్యవహరించి నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులను అభినందించిన డీజీపీ.. వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. లాక్‌పడెత్‌ కేసులను అడ్డుకొనేందుకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం తదితరాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ‘ఆపరేషన్‌ 2.0 గంజాయి’ వేటలో ఇప్పటివరకు 20 వేల మందిని అరెస్ట్‌ చేశామని, వారిలో 200 మందిపై గూండా చట్టం ప్రయోగించామన్నారు. కేసుల్లో విడుదలైన వారు మళ్లీ గంజాయి విక్రయాలు చేపడితే వారిని గూండా చట్టం కింద అరెస్ట్‌ చేయడంతో పాటు వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. తమ సమస్యలపై పోలీసులు ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని డీజీపీ తెలిపారు.

Updated Date - 2022-05-25T14:00:17+05:30 IST