గురుకుల పాఠశాల విద్య నా భవిష్యత్తుకు పునాది వేసింది

ABN , First Publish Date - 2021-12-27T18:51:56+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలం సర్వేల్‌లోని గురుకుల పాఠశాల దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇది హర్షించదగ్గ విషయమని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా

గురుకుల పాఠశాల విద్య నా భవిష్యత్తుకు పునాది వేసింది

డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యాఖ్య


కీసర రూరల్‌, డిసెంబరు 26 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలం సర్వేల్‌లోని గురుకుల పాఠశాల దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇది హర్షించదగ్గ విషయమని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా అన్నారు. ఆదివారం ఈ పాఠశాల స్వర్ణోత్సవాలను పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్‌ జిల్లా నాగారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులంతా కలిసి పాఠశాల స్వర్ణోత్సవాలు నిర్వహించటం సంతోషంగా ఉందని అన్నారు. తనకు ఈ గురుకులంలో విద్యనభ్యసించే అవకాశం లభించలేదని గుర్తు చేసుకున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి, డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన వారు ఐఏఎస్‌, ఐపీఎస్‌, డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారని అన్నారు. తాను ఈ పాఠశాలలో చేరటంతోనే తన ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు పడ్డాయన్నారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి, కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన అందించాలని, అక్షరాస్యతతోనే పేదరికం పోతుందని తమ తండ్రి అనే వారని గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2021-12-27T18:51:56+05:30 IST