ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తాం: ఏపీ డీజీపీ

ABN , First Publish Date - 2022-04-19T21:39:58+05:30 IST

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తాం: ఏపీ డీజీపీ

అమరావతి: రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హోంమంత్రి తానేటి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రైమ్ రేటు తగ్గింపు, సారా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. నెల్లూరు కోర్టులో చోరీ విషయంలో సాక్ష్యాల ఆధారంగా ముందుకెళ్లామన్నారు. నెల్లూరు కోర్టు వివాదంపై ఎస్పీ ఇప్పటికే క్లియర్ చేశారన్నారు. చోరీ చేసినవారు పలు కేసుల్లో నిందితులని, విచారణలో వాస్తవాలు బయటపడతాయన్నారు. ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే ఇవ్వాలని సమన్లు జారీ చేశామని, స్థానికంగా ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టామన్నారు.


దిశ యాప్‌ రిజిస్టర్‌తో మహిళల వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది ఉండదని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దిశ యాప్ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. డేటా దుర్వినియోగం అవుతుందని భావించొద్దన్నారు. 15 రోజుల్లోగా పాడేరు, మన్యం జిల్లాల్లో పోలీస్ కార్యాలయాలు పూర్తి చేస్తామన్నారు. కొత్త జిల్లాల్లో ఎస్పీలు పొజిషన్ తీసుకున్నారని, కొత్త జిల్లాల సందర్భంగా హెడ్ క్వార్టర్‌లో ఉన్న స్టాఫ్‌ను డిస్ట్రిబ్యూట్ చేశామన్నారు. స్టాఫ్‌ను రివర్స్ సీనియారిటీ కింద బదిలీ చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-19T21:39:58+05:30 IST