హైదరాబాద్: గణేష్ నిమజ్జనం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. నిమజ్జనం కార్యక్రమాన్ని ఆయన కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టెక్నాలజీతో పర్యవేక్షిస్తున్నామని, ఈ సంవత్సం ఇదే స్పెషాలిటి అని చెప్పారు. అడుగడుగునా సీసీ కెమెరాలు, కమాండింగ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ లెవల్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్, కమిషనరేట్, జోనల్ డీజీపీ, డీజీపీ కార్యాలయాలు, ప్రభుత్వం లెవల్లో అందరూ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.