విజయనగరం: డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ, బీజేపీ ఉందని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ నేతగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ నిర్లక్ష్యంగా...నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారన్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై పోలీసుల దాడులు పిరికిపంద చర్య అన్నారు. బీజేపీ శ్రేణులకు డీజీపీ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు.