Advertisement
Advertisement
Abn logo
Advertisement

చినజీయర్‌స్వామి ఆశ్రమానికి డీజీపీ

శంషాబాద్‌ రూరల్‌: ముచ్చిం తల్‌లోని చిన జీయర్‌స్వామి ఆశ్రమాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటలిజెన్స్‌ డీఐజీ ఇక్బాల్‌ బుధ వారం సందర్శించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 216 అడుగుల సమతామూర్తి పంచలోహ విగ్రహా విష్కరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీపాటు కేంద్ర మం త్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విదేవీ ప్రముఖులు రానున్న నేపథ్యంలో పార్కింగ్‌, హెలీప్యాడ్‌ స్థలాలను పరిశీలిం చారు. దీంతోపాటు భద్రతకు సంబంధించిన పలు అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఆశ్రమ నిర్వాహకులతో చర్చిం చారు. డీజీపీ వెంట సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ వేముల భాస్కర్‌, సీఐ ప్రకాష్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఏఈ, ఇతర సిబ్బంది ఉన్నారు. Advertisement
Advertisement