విమానాలకూ ముప్పుగా మారిన మిడతలు!

ABN , First Publish Date - 2020-05-30T01:20:18+05:30 IST

మిడతల సెగ ఇప్పుడు విమానాలకూ తాకింది. వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్

విమానాలకూ ముప్పుగా మారిన మిడతలు!

న్యూఢిల్లీ: మిడతల సెగ ఇప్పుడు విమానాలకూ తాకింది. వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)  శుక్రవారం పైలట్లు, ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. కీలకలమైన ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో అత్యంత జాగురూకతతో ఉండాలని సూచించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌‌లో మళ్లీ ఎడారి మిడతల దండయాత్ర మొదలైంది. తొలుత రాజస్థాన్‌లో పంటలపై దాడి చేసిన ఈ మిడతల గుంపు ఇప్పుడు పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లను చేరింది. సాధారణంగా మిడతలు తక్కువ ఎత్తులోనే ఎగురుతుంటాయి కాబట్టి విమానాలకు అత్యంత క్లిష్టమైన దశ అయిన ల్యాండింగ్, టేకాఫ్‌ సమయాల్లో వాటి నుంచి ముప్పు పొంచి ఉందని డీజీసీఏ పేర్కొంది. విమానం కనుక మిడతల సమూహనం నుంచి కనుక వెళ్తే అవి ఇంజిన్‌లోకి, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్లెట్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

 

Updated Date - 2020-05-30T01:20:18+05:30 IST