* మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : విమానయాన సంస్థ SpiceJetకు DGCA(Director General of Civil Aviation) నోటీసులు జారీ చేసింది. నోటీసు అందిన మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ని DGCA ఆదేశించింది. సాంకేతిక లోపాల నేపథ్యంలో... ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల మధ్య... బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్‌కు DGCA బుధవారం షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఆయా సంఘటనలను... కాంపోనెంట్ వైఫల్యం, లేదా... సిస్టమ్ సంబంధిత వైఫల్యానికి సంబంధించినవని DGCA తన నోటీసులో పేర్కొంది.
కాగా... నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించి తీసుకోవాల్సి ఉన్న చర్యల నుంచి మినహాయింపు పొందేందుకుగాను కారణాలను వివరించాలని DGCA ఆదేశించింది. ‘తక్కువ స్థాయిలో ఉన్న అంతర్గత భద్రతా పర్యవేక్షణ, నిర్వహణ చర్యల్లో లోపాలను DGCA తన నోటీసులో పేర్కొంది. ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలను సమీక్షించాలని స్పైస్‌జెట్‌ను DGCA ఆదేశించింది. ఇక... ‘నిర్ణీత వ్యవధిలోగా సమాధానం రాని పక్షంలో... విషయం ఎక్స్-పార్టీగా కొనసాగుతుం’ అని నోటీసు పేర్కొంది.
కాగా... స్పైస్‌జెట్‌కు DGCA నోటీసును రీట్వీట్ చేస్తూ... ‘ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యమైనది. భద్రతకు ఆటంకం కలిగించే చిన్న లోపాన్ని కూడా క్షుణ్ణంగా శోధించడంతోపాటు సరిదిద్దబడుతుంది’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వాతావరణ రాడార్ పనిచేయకపోవడంతో స్పైస్‌జెట్ పైలట్లు... కోల్‌కతా-చాంగ్కింగ్ ఫ్లైట్ కోల్‌కతాకు తిరిగి వచ్చిన ఘటన కొద్ది రోజుల క్రితం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మరో సందర్భంలో... ఇంధన సూచిక సరిగా పనిచేయకపోవడంతో స్పైస్‌జెట్ ఢిల్లీ-దుబాయ్ విమానాన్ని కరాచీకి మళ్లించారు.
ఇక... 23 వేల అడుగుల ఎత్తులో ఉన్న మానం విండ్షీల్డ్పై పగుళ్లు ఏర్పడడంతో ముంబైలో ఎమర్జన్సీ ల్యాండింగ్ జరిగింది. ఈ తరహా సంఘటనలు కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే ఎనిమిది చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా... స్పైస్‌జెట్ షేర్లు బుధవారం ఏడు శాతం క్షీణించి, దాని ఒక సంవత్సరం కనిష్ట స్థాయిని తాకాయి, ఇటీవలి వారాల్లో స్పైస్‌జెట్ విమానాలు సాంకేతిక లోపాలకు గురైన సందర్భాలు పలు సందర్భాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి