అటవీశాఖకు మంచిపేరు తీసుకురావాలి

ABN , First Publish Date - 2021-01-19T04:36:13+05:30 IST

అటవీశాఖకు మంచిపేరు తీసుకురావాలి

అటవీశాఖకు మంచిపేరు తీసుకురావాలి

ములుగు కలెక్టరేట్‌, జనవరి 18: అటవీశాఖ అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా మంచిపేరు తీసుకురావాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్‌కుమార్‌శెట్టి అన్నారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన గోవిందరావుపేట మండలం పస్రా వైల్డ్‌లైఫ్‌ ఫారెస్టు చెక్‌పోస్టుతో పాటు ములుగు, జంగాలపల్లి చెక్‌పోస్టులను సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టార్పాలిన్‌ కవర్లు ఉన్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, రాత్రిపూట జరిగే అక్రమ కలప, వన్యప్రాణులు, ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పస్రా వైల్డ్‌లైఫ్‌ వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంచాలని, వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సెక్షన్‌ ఆఫీసర్‌ సందీప్‌, బీట్‌ ఆఫీసర్లు శ్యాంప్రసాద్‌, మధు, బాలకృష్ణ, సువర్ణ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-01-19T04:36:13+05:30 IST