నా కన్నా నమ్మకమైన బ్యాట్స్‌మన్‌

ABN , First Publish Date - 2020-07-02T09:12:38+05:30 IST

మైదానంలో విరాట్‌ కోహ్లీతో తనది అద్భుతమైన భాగస్వామ్యమని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిల్లీర్స్‌ అన్నాడు. తామిద్దరిదీ విభిన్నమైన...

నా కన్నా నమ్మకమైన బ్యాట్స్‌మన్‌

విరాట్‌పై డివిల్లీర్స్‌ ప్రశంసలు

న్యూఢిల్లీ: మైదానంలో విరాట్‌ కోహ్లీతో తనది అద్భుతమైన భాగస్వామ్యమని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిల్లీర్స్‌ అన్నాడు. తామిద్దరిదీ విభిన్నమైన శైలి అన్న ఏబీ.. తనకంటే అతను నమ్మకమైన బ్యాట్స్‌మన్‌ అని చెప్పాడు. ‘తొలి ఐదు ఓవర్లు అవకాశమిస్తే నేను రెచ్చిపోతా. ఈ విషయంలో విరాట్‌ నా కన్నా మరింత నమ్మకమైన ఆటగాడు. అతను 15 ఓవర్ల పాటు అదే స్థాయిలో విజృంభించగలడు’ అని కామెంటేటర్‌ హర్షాభోగ్లేకు ఇచ్చిన క్రిక్‌బజ్‌ ఇంటర్వ్యూలో డివిల్లీర్స్‌ వెల్లడించాడు. విరాట్‌, ఏబీ కలిసి ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున 69 ఇన్నింగ్స్‌లో 9 సార్లు వందకుపైగా భాగస్వామ్యాలు నమోదు చేశారు. కాగా.. 2015 ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో తాము ఓటమిపాలవడం ఎంతో బాధించిందనీ.. ఏడాదిపాటు ఆ బాధ నుంచి కోలుకోలేకపోయానని 36 ఏళ్ల డివిల్లీర్స్‌ అన్నాడు. ఒకరకంగా తాను అనూహ్యంగా రిటైర్మెంట్‌ తీసుకునేందుకు ఆ ఓటమే ప్రధాన కారణమైందన్నాడు. 

Updated Date - 2020-07-02T09:12:38+05:30 IST