ఐపీఎల్లో 112 మీటర్ల భారీ సిక్సర్.. కొట్టిందెవరంటే
ABN , First Publish Date - 2022-04-15T01:05:19+05:30 IST
పుణె : ఐపీఎల్ 2022లో 112 మీటర్ల భారీ సిక్సర్ నమోదయ్యింది. పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు డెవాల్డ్ బ్రెవీస్ ఈ సిక్సర్ బాదాడు.
పుణె : ఐపీఎల్ 2022లో 112 మీటర్ల భారీ సిక్సర్ నమోదయ్యింది. పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు డెవాల్డ్ బ్రెవీస్ ఈ సిక్సర్ బాదాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద సిక్సర్‌గా రికార్డయింది. దీంతో ఈ సీజన్లో భారీ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ల జాబితాలో బ్రెవీస్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత లియామ్ లివింగ్‌స్టోన్ 108 మీటర్ల సిక్సర్లతో రెండవ స్థానం దక్కించుకున్నాడు. ఆసక్తికరంగా మూడవ లాంగెస్ట్ సిక్సర్ కూడా లివింగ్ స్టోన్ పేరిటే ఉంది. 105 మీటర్ల డిస్టెన్స్తో మూడవ స్థానంలోనూ నిలిచాడు. ఇక 102 మీటర్ల సిక్సర్లతో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శివమ్ దూబే 4వ స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో 98 మీటర్ల దూరం సిక్సర్ కొట్టిన జాస్ బట్లర్ 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సీజన్లో ఇంకా చాలా మ్యాచులు మిగిలివుండడంతో ఇంకెన్ని సిక్సర్లు నమోదవుతాయో.. లాంగెస్ట్ సిక్సర్ రికార్డ్ బద్దలవుతుందో లేదో వేచిచూడాలి.