దేవుడి భూమిలో ఆక్రమణల కూల్చివేత

ABN , First Publish Date - 2021-07-26T06:17:04+05:30 IST

పుణ్యక్షేత్రమైన పృథులగి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన సిమెంట్‌ రోడ్డును ఆది వారం అధికారులు ధ్వంసం చేశారు.

దేవుడి భూమిలో ఆక్రమణల కూల్చివేత
సీసీ రోడ్డును ధ్వంసం చేసిన సిబ్బంది


సిమెంట్‌ రోడ్డును ధ్వంసం చేయించిన అధికారులు

ఆ స్థలం విలువ రూ.3కోట్లు

పొదిలి, జూలై 25 :  పుణ్యక్షేత్రమైన పృథులగి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన సిమెంట్‌ రోడ్డును ఆది వారం అధికారులు ధ్వంసం చేశారు. పొదిలి సర్వే నెంబర్‌-831లో 7ఎక రాల 41 సెంట్లు కోట్లాది రూపాయల విలువైన భూమిలో కొంతభాగం (60 సెంట్లు) ఆక్రమణకు గురైంది.  ఇటీవల దేవాలయ భూమిలో కౌలు వేలం ప్రక్రియను అధికారులు చేప ట్టారు. విలువైన భూమి ఆక్రమణకు గురైందని, అక్క సర్వే నిర్వహిం చకుండా వేలం ప్రక్రియ జరగకూ డదని పాలకవర్గ చైర్మన్‌ కుప్పం  చిన్నకొల్లారావు, పాలకవర్గ సభ్యులు పట్టుబట్టారు. దేవాలయశాఖ  అధి కారులు వేలం నిర్వహించ కుండా తాత్సారం చేస్తుండడంతో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, పాలకవర్గ చైర్మన్‌ కుప్పం చిన్నకొల్లారావు ఉన్నతాధికారుల దృ ష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటీవల సర్వే నిర్వహించారు. దేవాలయ భూమి రూ.3 కోట్లు విలువ చేసే 60 సెంట్లకు పైగా ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించారు. దేవాలయ భూమి లో సిమెంట్‌ రోడ్లు వేయడంతో పాటు పక్కా కట్టడాలు జరిగినట్లు నిర్ధా రించారు. వెంటనే అక్రమ కట్టడాలు తొలగించే చర్యలకు ఉపక్రమించ నున్నట్లు సర్వే అనంతరం అధికారులు ప్రకటించారు. ఆ మేరకు ఆదివారం దేవాలయ భూమిలో అక్రమంగా వేసిన సిమెంట్‌ రోడ్డును  ఎక్స్‌కవేటర్‌తో అధికారులు తొలగించారు. ఎట్టకేలకు ఆక్రమణదారుల చెర  నుంచి దేవాలయ భూమిని కాపాడడంలో పాలకవర్గం కృషి  ఫలించింది. కార్య క్రమంలో కందుకూరు దేవాలయ ఇన్‌స్పెక్టర్‌ శైౖలేంద్రకుమార్‌, పాలకవర్గ చైర్మన్‌ కుప్పం చిన్నకొల్లారావు, ఈవో రవికుమార్‌, దేవాలయ జూనియర్‌ అసిస్టెంట్‌  కాటూరి ప్రసాద్‌, పాలకవర్గ కమిటీ సబ్యులు శ్రీరామ వెంకటేశ్వర్లు, నాయకులు సారెడ్డి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-26T06:17:04+05:30 IST