దర్గాలో భక్తుల కోలాహలం

ABN , First Publish Date - 2022-08-10T04:37:11+05:30 IST

నెల్లూరులో రొట్టెల పండుగ సందర్భంగా మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరులో భక్తుల కోలాహలం ప్రారంభమైంది.

దర్గాలో భక్తుల కోలాహలం
కసుమూరు ప్రధాన వీధిలో భక్తుల రద్దీ

వెంకటాచలం, ఆగస్టు 9 :  నెల్లూరులో రొట్టెల పండుగ సందర్భంగా మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరులో భక్తుల కోలాహలం ప్రారంభమైంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తమ వాహనాల్లో తరలివచ్చి మస్తాన్‌స్వామిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వక్ఫ్‌బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నెల్లూరు నుంచి కసుమూరు వరకు నడుపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. పారిశుద్య చర్యలు, తాగునీటి చలివేంద్రాలు, మరుగుదొడ్లు వంటి అన్ని చర్యలు అధికారులు చేపట్టారు. 

Updated Date - 2022-08-10T04:37:11+05:30 IST