యాదాద్రిలో భక్తుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-04-05T02:28:12+05:30 IST

నృసింహుడి దర్శనానికి యాదగిరిగుట్టకు వెళ్లిన భక్తులు కొండపై నీడ లేక తాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

యాదాద్రిలో భక్తుల ఇక్కట్లు

యాదాద్రి: నృసింహుడి దర్శనానికి యాదగిరిగుట్టకు వెళ్లిన భక్తులు కొండపై నీడ లేక తాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవస్థాన అధికారుల నిర్లక్ష్యంతో వేసవిలో ఆరుబయట వేడికి భక్తులు అల్లాడిపోతున్నారు. ఆరేళ్లుగా స్వయంభువుడిని దర్శించుకోలేకపోయిన భక్తులు ప్రధానాలయంలోకి ప్రవేశాలు ప్రారంభం కావడంతో స్వామి దర్శనార్థం పోటెత్తుతున్నారు. అయితే కనీస సౌకర్యాలు లేకపోవడం భక్తులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. వేసవి కాలం కావడంతో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ఉక్కపోత పెరిగింది. ఈ క్రమంలో ఎండవేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు దేవస్థాన అధికారులు కొండపైన షామియానాలు ఏర్పాటు చేయలేదు. కనీసం మంచినీటి వసతిని కూడా కల్పించలేదు. దీంతో మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. సోమవారం ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు చేరడంతో చంటి పిల్లల తల్లులు, వృద్ధులు ఎండవేడిమి, ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆలయ పరిసరాల్లో వేసవికాలంలో భక్తులకు కనీస సౌకర్యాలను అధికారులు కల్పించడం మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-05T02:28:12+05:30 IST