యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో భక్తులు రద్దీ నెలకొన్నది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. అభివృద్ధి పనులు దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతించడంలేదు.