ధర్మపురి ఆలయంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-12-06T05:55:07+05:30 IST

ధర్మపురి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మార్గశిర మాసం పురస్కరించుకుని సెలవు దినం కావటంతో అనేక మం ది భక్తులు తరలి వచ్చారు.

ధర్మపురి ఆలయంలో భక్తుల రద్దీ
స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్న భక్తులు

ధర్మపురి, డిసెంబరు 5: ధర్మపురి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మార్గశిర మాసం పురస్కరించుకుని సెలవు దినం కావటంతో అనేక మం ది భక్తులు తరలి వచ్చారు. గోదావరి నదిలో భక్తులు స్నానాలు చేసారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయాలకు చేరుకుని స్వా మి వారలను దర్శించుకున్నారు. కొందరు భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసి కుంకుమార్చన, అభిషేకాది పూజలు, స్వామి వారి నిత్య కల్యాణం చేయిం చారు. స్వామి వారలకు వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పం డితులు ముత్యాలశర్మ, మంత్రోచ్ఛరణల మధ్య ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈవో సంకటాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తు లకు తగు సేవలు అందించారు. ఆలయ సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌ కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, ముఖ్య అర్చకులు రమ ణాచార్యా, నరసింహమూర్తి, అభిషేక్‌ పౌరోహితులు బొజ్జ సంతోష్‌కుమా ర్‌, సంపత్‌కుమార్‌, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-06T05:55:07+05:30 IST