Abn logo
Sep 17 2020 @ 10:53AM

హరిద్వార్‌లో భక్తుల కోలాహలం... కొనసాగుతున్న పితృ అమావాస్య కార్యాలు!

Kaakateeya

హరిద్వార్: దేశంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుండగా, మరోవైపు స్థానిక ఉత్సవాలు, పండుగలు జనసందోహం మధ్య జరుగుతుండటం విశేషం. ఈరోజు పితృ అమావాస్య. ఈ సందర్భంగా పెద్దలకు తర్పణాలు వదలడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపధ్యంలో హరిద్వార్‌కు చేరుకున్న భక్తులు ఉదయం నుంచే పుణ్య స్నానాలు చేస్తూ, పితృకార్యాలు నెరవేరుస్తున్నారు. దీంతో గంగా తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు వివిధ గంగా ఘాట్‌లకు చేరుకుని, పితృకార్యాలతో పాటు దానధర్మాది కార్యక్రమాలు చేపడుతున్నారు. 


Advertisement
Advertisement