APNews: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పోటెత్తిన భక్తజనం

ABN , First Publish Date - 2022-05-30T13:11:20+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తజనం పోటెత్తారు. అమావాస్యతో పాటు సోమవారం కలిసిరావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

APNews: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పోటెత్తిన భక్తజనం

తిరుపతి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తజనం పోటెత్తారు. అమావాస్యతో పాటు సోమవారం కలిసిరావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. రాహు-కేతు కాలసర్పదోష నివారణ పూజలకు  భక్తులు బారులు తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు కిక్కిరిశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


Updated Date - 2022-05-30T13:11:20+05:30 IST