పశ్చిమ బెంగాల్‌లో ప్రార్థన మందిరాలకు వెళ్లడంపై భక్తుల పునరాలోచన

ABN , First Publish Date - 2020-06-06T02:29:41+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం అమల్లో

పశ్చిమ బెంగాల్‌లో ప్రార్థన మందిరాలకు వెళ్లడంపై భక్తుల పునరాలోచన

కోల్‌కతా : కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం అమల్లో ఉన్నపుడే ఈస్టర్, ఈద్ వచ్చాయి. అయినప్పటికీ క్రైస్తవులు, ముస్లింలు సామూహికంగా వీటిని జరుపుకోలేకపోయారు. 


పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మతపరమైన ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కానీ చాలా ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు పెద్దలు ముందుకు రావడం లేదు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌పై ఆందోళన కారణంగా వీటిని భక్తులకోసం తిరిగి తెరిచేందుకు వెనుకాడుతున్నారు. 


అష్ట దిగ్బంధనం ప్రారంభమైనపుడు ఆన్‌లైన్ ప్రార్థనలు నిర్వహించడం మొదలుపెట్టారు. క్రమం తప్పకుండా ప్రార్థనా స్థలాలకు వెళ్లడం అలవాటైనవారు ఈ ఆన్‌లైన్ ప్రార్థనలను వ్యతిరేకించారు. కానీ రెండు నెలలు గడిచేసరికి కోవిడ్ భయంతో ఆన్‌లైన్ ప్రార్థనలకే మొగ్గు చూపుతున్నారు. 


ప్రార్థనా స్థలాలను తెరవకపోవడమే మంచిదని కొందరు భక్తులు చెప్తున్నారు. ఆన్‌లైన్‌ ప్రార్థనలు సంతృప్తినిస్తున్నట్లు చెప్తున్నారు. 


Updated Date - 2020-06-06T02:29:41+05:30 IST