చిలుకూరుకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-07-04T05:03:16+05:30 IST

కలియుగ దైవం చిలుకూరు బాలాజీని ఆదివారం

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు
భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న అర్చకులు రంగరాజన్‌

మొయినాబాద్‌ రూరల్‌, జూన్‌ 3 : కలియుగ దైవం చిలుకూరు బాలాజీని ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగింది. ఉదయం 5 గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని ఆలయ ప్రదాన అర్చకులు సీఎ్‌స.రంగరాజన్‌ పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణ చేసి నిత్యహారతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయం బయట నుంచే ప్రదక్షణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీఎ్‌స.రంగరాజన్‌ మాట్లాడుతూ భక్తులు హిందూ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలని.. విదేశి సంస్త్క్రతీ, సంప్రదాయాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


రోడ్డుకు మరమ్మతులు చేయించిన రంగరాజన్‌ 

చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటంతో నిత్యం భక్తులు ఇబ్బందులు పడేవారు. అడుగుకో గుంత ఉండటంతో ప్రమాదాలు జరుగుతుండేవి. రోడ్డుకు మరమ్మతు చేపట్టాలని పాలకులకు, అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌. రంగరాజన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఆలయం ప్రదాన చౌరస్తా కమాన్‌ నుంచి ఆలయ సమీపంలోని వాహనాల పార్కింగ్‌ వరకు ఉన్న గుంతలను మట్టితో పూడ్చివేయించారు. భక్తులకు ఇబ్బంది కలగవద్దనే ఈ పనిచేపట్టినట్లు రంగరాజన్‌ పేర్కోన్నారు. ప్రభుత్వ యంత్రంగం స్పం దించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. 



Updated Date - 2022-07-04T05:03:16+05:30 IST