చప్రాలకు పాదయాత్రగా తరలిన భక్తులు

ABN , First Publish Date - 2022-01-19T04:17:38+05:30 IST

మండలంలోని ఎల్కపల్లి గ్రామంలోని అభయాంజనేయ ఆలయం నుంచి మంగళవారం మహారాష్ట్రలోని చప్రాల ఆధ్మాతిక కేంద్రానికి 17వ మహాపాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భాజాభజంత్రీల మధ్య భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు

చప్రాలకు పాదయాత్రగా తరలిన  భక్తులు
బెజ్జూరు నుంచి చప్రాలకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులు

బెజ్జూరు/చింతలమానేపల్లి/కౌటాల, జనవరి 18:  మండలంలోని ఎల్కపల్లి గ్రామంలోని అభయాంజనేయ ఆలయం నుంచి మంగళవారం మహారాష్ట్రలోని చప్రాల ఆధ్మాతిక కేంద్రానికి 17వ మహాపాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భాజాభజంత్రీల మధ్య భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు. పాదయాత్ర బెజ్జూరు, కుకుడ, పోతెపల్లి, బారెగూడ, ముంజంపల్లి, రుద్రాపూర్‌, చింతలమానేపల్లి, అనుకోడ, బాబాపూర్‌ తదితర గ్రామాల మీదుగా సాయంత్రానికి మహారాష్ట్రలోని చప్రాల ఆధ్యాత్మిక కేంద్రానికి చేరుకుంది. ఆయా గ్రామాల్లో పాదయాత్ర భక్తులను ఘన స్వాగతం పలికి తేనీరు, పండ్లు, మజ్జిగ, అల్పాహారాన్ని అందజేశారు. చింతలమానేపల్లిలో చప్రాలకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు వివిధ వర్గాలకు చెందిన పలువురు అల్పాహారం, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అల్పాహారం అందజేయగా, అభయాంజనేయ హనుమాన్‌ ఆలయం ఆధ్వర్యంలో అన్నదానం, బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో భక్తులకు పండ్లు, మాస్కులు వేరు వేరుగా పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజన్న, మారుతి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి నది ఒడ్డున గల కార్తీక్‌ మహారాజ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు చప్రాలకు బయలుదేరి వెళ్లారు. నాటు పడవలో భక్తులు ప్రాణహితలో వెళ్తుండడంతో ముందస్తు జ్రాత్తలు చేపట్టారు. సీఐ బుద్దేస్వామి, ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో  నాటు పడవల్లో పరిమితికి మించి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2022-01-19T04:17:38+05:30 IST