రేపటి నుంచి మోగనున్న గుడి గంటలు

ABN , First Publish Date - 2020-06-07T10:36:47+05:30 IST

కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యాప్రవర్తతే.. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌.. ఈ శ్లోకాలు మళ్లీ ఆలయాల నుంచి...

రేపటి నుంచి మోగనున్న గుడి గంటలు

సోమవారం నుంచి ఆలయాల్లోకి భక్తులకు అనుమతి

పూజలకు అనుమతి లేదు                                           

కేవలం దర్శనం మాత్రమే

తీర్థ ప్రసాదాల వితరణకూ నో

మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి


నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 6: కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యాప్రవర్తతే.. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌.. ఈ శ్లోకాలు మళ్లీ ఆలయాల నుంచి వినిపించనున్నాయి. సుప్ర భాత సేవలు, ఆలయాల్లో జరిగే సేవలు మళ్లీ భక్తులకు అం దుబాటులోకి రానున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఆలయాల్లో ఏకాంత సేవలకే పరిమితమైన పూజలు, దర్శనాలకు భక్తులకు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 22 నుంచి దర్శనం అవకాశం కోల్పోయిన భక్తులకు 78 రోజుల తర్వాత దర్శనం చేసుకునే అవకాశం లభిస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆల యాల్లో మార్చి 22 నుంచి ద ర్శనాలను, ఆర్జిత సేవలను ర ద్దు చేస్తూ ఆలయాల్లో నిత్య పూజాది కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్న డూ లేనివిధంగా భక్తులకు దాదాపు మూడు నెలల పా టు దర్శన అవకాశం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులో భాగం గా రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తూ ఆలయాలకు, ప్రార్థన మందిరాలకు అను మతులిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపి అందుకు తగిన ఏర్పాట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం నియమాలకు లోబడి ఆలయాలను భక్తుల దర్శనార్థం సోమవా రం నుంచి తెరవనుంది. ఆలయాల్లో భౌతికదూరం పాటిస్తూ, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతూ మాస్కులతోనే భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 


నియమ నిబంధనలతో అనుమతి.. 

కరోనా కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్జి త సేవలు, దర్శనాలు మళ్లీ ప్రారంభం కానుండడంతో  అం దుకు అనుగుణంగా నియమ నిబంధనలతో భక్తులకు దేవా దాయశాఖ అనుమతులు ఇవ్వనున్నారు. దర్శనానికి వచ్చే ప్రతీ భక్తుడు సంప్రదాయ దుస్తులతో పాటు మాస్కులు ఽధరించాలని, వ్యక్తిగత శుభ్రతను పాటించే వారికే అనుమతిచ్చేలాగా ప్రణాళిక చేస్తున్నారు. ఆలయాల్లో భక్తులు స్వామి ని దర్శించుకునేందుకు ఒకరినొకరు తోసుకోకుండా భౌతిక దూరం పాటించే విధంగా క్యూలైన్‌లలో సూచికలతో ఏర్పా టు చేస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులననుసరించి ఆలయా ల్లో స్వామి సేవలో ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తులు భక్తితో దర్శించుకునే విధంగా అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాల్లో ఆన్‌లైన్‌ ద్వారా సేవ టికెట్‌లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో నీలకంఠేశ్వర్‌, మాధవనగర్‌ సాయిబా బ, చుక్కాపూర్‌ లక్ష్మినర్సింహస్వామి, సలాబత్‌పూర్‌ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలపై అధికారులు దృ ష్టి సారించారు. ఆలయాల్లో భక్తులకు దర్శన అవకాశాన్ని క ల్పిస్తూనే ఆదాయం పెంచేలా ఆలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.


ప్రార్థన మందిరాల్లో నియమాలు తప్పనిసరి..

అన్ని మతాల ప్రార్థన మందిరాల్లో నిత్య కార్యక్రమాలకు నియమాలు పాటిస్తూ తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. దీంతో దేవాలయాలు, ప్రార్థనా మందిరా లు, మసీదులు, గురుద్వారాలు నిబంధనల మేరకే సోమవా రం నుంచి తెరుచుకోనున్నాయి. రెండు నెలలుగా భక్తులు ప్రార్థన మందిరాల్లో ప్రార్థించుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్‌లతో ప్రార్థనలకు ఏర్పాట్లు చేస్తు న్నారు. 


తీర్థ ప్రసాదాలు దూరం..

భక్తులు స్వామిని దర్శించుకోవడం, సేవల్లో పాల్గొనడం మాత్రమే చేయాలని, ప్రసాదం మాత్రం ఉండదని ఉత్తర్వు ల్లో  పేర్కొన్నారు. దీంతో భక్తులకు స్వామి దర్శనం మాత్రం ఉండనుంది. ప్రసాదం పొందే అవకాశం ఉండబోదు. ప్రసాదాలు భక్తులకు ఇచ్చే అవకాశం లేదని, మరి కొన్నిరోజులు ప్రసాదం కోసం ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ప్రతీ ఆలయంలో స్వామి దర్శనంతో పాటు ప్రసాదం అం దుకోవడం భక్తులు విశిష్టతగా భావిస్తారు. భక్తులు తీర్థ ప్ర సాదాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. 

 అన్ని ఏర్పాట్లతో భక్తులకు అనుమతి..  

- సోమయ్య, సహాయ కమిషనర్‌

స్వామిని భక్తులు దర్శించుకునే వి ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్ర భుత్వం విధించిన నిబంధనల ప్రకా రం ప్రతీ భక్తుడికి ఆరు అడుగుల భౌతిక దూరం ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం. ప్రతీ ఆలయంలో శానిటైజర్‌, సబ్బులు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఆలయ నియమాలను పాటిస్తూ మాస్కులను ధరిస్తూ దర్శించుకోవాలి. పది సంవత్సరాలలోపు పిల్లలు, 65 సంవత్సరాల వృద్ధులకు అనుమతి లేదు. ఆలయాల్లో స్వామి తీర్థ ప్రసాదాలు అందించడం జరగదు. భక్తులకు ఆలయ గర్భ గుడి ప్రవేశం కూడా ఉండదు, స్వామిని దర్శించుకొని అధి కారులకు సహకరించాలి. ఆలయాల్లో మిగతా ఆర్జిత సేవ లు కొనసాగుతాయి. 

Updated Date - 2020-06-07T10:36:47+05:30 IST