తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తులు

ABN , First Publish Date - 2022-03-21T01:39:00+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం రికార్డుస్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. కరోనా తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలు

తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తులు

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం రికార్డుస్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. కరోనా తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలు టీటీడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల వైరస్‌ ప్రభావం దాదాపుగా తగ్గిన క్రమంలో దర్శనాల సంఖ్యను భారీగా పెంచింది. ఈ క్రమంలోనే శనివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 80,429 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 2020 మార్చి తర్వాత 80వేల దర్శనాల సంఖ్య దాటడం ఇదే మొదటిసారి. ఇక హుండీ ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.


అలాగే 38,182 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొంది. కాగా, ఆదివారం సాయంత్రానికి కూడా రద్దీ తగ్గలేదు. శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, కాటేజీలు, క్యూకాంప్లెక్స్‌లు, అన్నదాన భవనం, అఖిలాండం, బస్డాండ్‌ వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపిస్తున్నారు. మరోవైపు తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్‌ వాహనాల రద్దీతో కిటకిటలాడింది. చెకింగ్‌ కోసం వాహనాలు చెక్‌పాయింట్‌ నుంచి గరుడ సర్కిల్‌ వరకు బారులు తీరాయి. రద్దీ అధికం కావడంతో సెక్యూరిటీ సిబ్బంది వేగంగా తనిఖీలు చేసి తిరుమలకు అనుమతించారు. 

Updated Date - 2022-03-21T01:39:00+05:30 IST