శింగరకొండకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-11-28T05:27:24+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో చివరి శనివారం కావటంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రసన్నాంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. వాహన, ఆకు పూజ, అభిషేకాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పలువురు పొంగళ్లు పెట్టుకొని మొక్కులు తీర్చుకున్నారు. వాహనాలు, భక్తులు పెద్ద సంఖ్యలో రావటంతో శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

శింగరకొండకు పోటెత్తిన భక్తులు
ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు

అద్దంకి, నవంబరు 27: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో చివరి శనివారం కావటంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రసన్నాంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. వాహన, ఆకు పూజ, అభిషేకాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పలువురు పొంగళ్లు పెట్టుకొని మొక్కులు తీర్చుకున్నారు. వాహనాలు, భక్తులు పెద్ద సంఖ్యలో రావటంతో శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 

ఘనంగా లక్ష దీపోత్సవం 

మద్దిపాడు, నవంబరు 27 :  లింగంగుంట విశ్వహిందూ పరిషత్‌ అధ్వర్యంలో అభయాంజనేయస్వామి దేవస్థానం అవరణలో కార్తీక మాసం పురస్కరించుకొని లక్షదీపోత్సవం శనివారం ఘనంగా  నిర్వహించారు. చుట్టు ప్రక్కల గ్రామాలనుంచి భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు.  విశ్వహిందూ పరిషత్‌ జిల్లా కార్యకర్తలు సదరబోయిన పున్నారావు, నేరెళ్ళ శ్రీనివాసరావు, నార్నె మురళీ కృష్ణ, పశుమర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T05:27:24+05:30 IST