Abn logo
Mar 2 2021 @ 23:02PM

పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఘనంగా ఆరో వారం జాతర

మక్కువ, మార్చి 2 : పోలమాంబ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆరో వారం జాతర ఘనంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలిరావడంతో చదురుగుడి, వనం గుడి పరిసరాలు కిటకిటలాడుతూ కనిపించాయి. వనం గుడి వేప చెట్టు వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గోముఖి నదీ తీరంలో పవిత్రస్నానాలు ఆచరించిన అనంతరం మొక్కుబడులు చెల్లించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమీప తోటల్లో వంటలు చేసుకొని సామూహిక భోజనాలు చేశారు.  భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో బీఎల్‌ నగేష్‌ ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐ కె.రాజేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేయడంతో భక్తులు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కాలినడకన శంబర గ్రామానికి చేరుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement