గండి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-06-20T04:47:22+05:30 IST

గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో శనివారం భక్తులు పోటెత్తారు.

గండి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ప్రత్యేక అలంకరణలో గండి వీరాంజనేయస్వామి

చక్రాయపేట, జూన్‌ 19: గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో శనివారం భక్తులు పోటెత్తారు. సహాయ కమిషనర్‌ అలవలపాటి ముకుందరెడ్డి కరోనాకు సంబంధించి  శానిటైజర్‌, మాస్కులు, తదితర అన్ని ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయక ముందే గండికి భారీఎత్తున భక్తులు రావడం ఇందుకు నిదర్శనం. కాగా శనివారం ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.96320 రాగా 3719 లడ్డు ప్రసాదాలు విక్రయించగా తద్వారా రూ.1,85,950 ఆదాయం వచ్చినట్లు సహాయ కమిషనర్‌ ముకుందరెడ్డి తెలిపారు. ఉద యాన్నే భక్తులు గండికి చేరుకోవడం, పాపాఘ్నిలో స్నానాలు చేయడం దర్శనం చేసు కున్నారు. స్పెషల్‌ దర్శనం, సర్వదర్శనం, ఆకుపూజలు కిక్కిరిసిపోయాయి. ఇక లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ప్రధాన అర్చకులు కేసరి, సిబ్బంది కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తులకు లఘుదర్శనం ఏర్పాటుచేశారు.



Updated Date - 2021-06-20T04:47:22+05:30 IST