Abn logo
Sep 26 2021 @ 00:33AM

అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

శ్రీఘ్రదర్శనం కోసం క్యూలో వేచివున్న భక్తులు

సింహాచలం, సెప్టెంబరు 25: వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామునే సింహాచలం చేరుకున్న పలువురు భక్తులు వరాహ పుష్కరిణిలో స్నానాలు చేసి భైరవస్వామిని దర్శించుకుని అమృతకలశాలు సమర్పించి, గుమ్మడి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అక్కడ నుంచి సింహగిరికి చేరుకుని తలనీలాలు సమర్పించి పవిత్ర గంగధారలో స్నానాలాచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని ముందుగానే ఊహించిన దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ కేశఖండనశాల వద్ద అదనపు క్షురకులను ఏర్పాటు చేసి తక్కువ సమయంలోనే భక్తులు తలనీలాలు సమర్పించేలా చేశారు. అలాగే ప్రసాదాల కొనుగోలుకు ఎక్కువ సమయం భక్తులు వేచివుండకుండా అదనంగా మూడు కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రసాదాలను విక్రయించారు.