అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-05-29T06:27:34+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం పెద్దసంఖ్యలో భక్తులు పోటెత్తారు.

అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
బస్సు కోసం బారులుదీరిన భక్తులు

శనివారం ఒక్కరోజే దేవస్థానం ఖజానాకు రూ.39.72 లక్షల ఆదాయం 

సింహాచలం, మే 28: సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం పెద్దసంఖ్యలో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు చేసి భైరవస్వామిని దర్శించుకున్నాక కొందరు మెట్ల మార్గంలో, మరికొందరు బస్సుల్లో సింహగిరికి చేరుకున్నారు. తలనీలాలు సమర్పించి గంగధారలో స్నానాలాచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడి కారణంగా శనివార ఒక్కరోజే దేవస్థానం ఖజానాకు సుమారు రూ.39.72 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా శ్రీఘ్ర, అతిశ్రీఘ్ర దర్శనాల రూ.100, రూ.300 టికెట్ల విక్రయాల ద్వారా రూ.24,71,870, లడ్డూ, పులిహోర ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.10,57,485, తలనీలాల రూ.25 టికెట్ల ద్వారా రూ.2,93,125, నిత్య కల్యాణం, ఇతర ఆర్జిత సేవల ద్వారా రూ.94,500, తదితరాలన్నీ కలిపి మొత్తం రూ39,72,530 ఆదాయం సమకూరినట్టు దేవస్థానం రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 


Updated Date - 2022-05-29T06:27:34+05:30 IST