ద్వారకా తిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది. కరోనా విజృంభణ తగ్గిన నేపథ్యంలో ఆలయానికి యాత్రికుల రాక అనూహ్యంగా పెరిగింది. శని,ఆదివారాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లో సగటున 8వేల నుంచి 10 వేలమంది వరకు శ్రీవారిని దర్శిస్తుంటారు. అదే శని, ఆదివారాల్లో 30 వేల నుంచి 50 వేలమంది వరకూ స్వామివారిని దర్శిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గడచిన 26 రోజులకుగాను ఈనెల 15న నిర్వహించిన హుండీల లెక్కింపులో శ్రీవారికి నగదు రూపంలో రూ. 2.88 కోట్లు ఆదాయం లభించింది.
ఇవి కూడా చదవండి